మదుమేహం అంటే మన రక్తంలో అధిక మోతాదులో చక్కెర నిల్వలు ఉండటమే. ఇన్సులిన్ అని పిలవబడే రసాయనం లేదా హార్మోన్ ను మన శరీరం తగినంత మోతాదులో ఉత్పత్తి చేయకపోతే అధిక చక్కెర సమస్య తలెత్తుతుంది.
మీరు తినే ఆహారంలో అధిక భాగాన్ని శరీరం ఒక విధమైన చక్కెరగా మారుస్తుంది, దానిని గ్లుకోజ్ అంటారు.
ఈ చక్కెర మన శరీరంలోని అన్ని కణాలకు రక్తం ద్వారా ప్రయాణిస్తుంది. మీకు శక్తి కావాలంటే శరీర కణాలకు ఈ చక్కెర అవసరం.
రక్తంలోని చక్కెర, శరీర కణాల్లోకి వెళ్లడానికి ఇన్సులిన్ సాయపడుతుంది. ఇన్సులిన్ లేకపోతే, మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచడానికి మీ శరీర కణాలు చక్కెరను పొందలేవు.
రక్తంలోని చక్కెర ను శరీర కణాల్లోకి పంపించడం ద్వారా ఇన్సులిన్, రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో(మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు) ఉంచడానికి సాయపడుతుంది.
మీ రక్తంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గించడానికి తగినంత ఇన్సులిన్ లేకపోతే మీకు మదుమేహం ఉన్నట్టు.
రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మదుమేహానికి చికిత్స ఉంది, తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.
మీ శరీరం ఇన్సులిన్ ను ఏమాత్రం తయారు చేసుకోలేనప్పుడు
మీ శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేసుకోలేనప్పుడు, లేదా శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు.
రక్తంలోని చక్కెరను, శరీర కణాల్లోకి పంపించేందుకు తగినంత ఇన్సులిన్ లేనప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది.
టైప్ 2 మదుమేహంలో మన శరీరం కొంత ఇన్సులిన్ ను తయారు చేసుకుంటుంది, కానీ అది సరిపోదు.
లేదా మన శరీరం తయారు చేసుకునే ఇన్సులిన్ పనిచేయదు
టైప్ 2 మదుమేహం తరచూ పెద్ద వయస్సువారిలోనే ప్రారంభమవుతిం,కానీ చిన్న పిల్లలకు కూడా ఉండొచ్చు.
కుటుంబంలో ఎవరికైనా ఉంటే, స్థూలకాయలకు ఈ ముప్పు మరీ ఎక్కువగా.
టైప్ 2 మదుమేహం రావటానికి అనేక కారణాలు ఉన్నాయి అవి:
మీరు పొగాకు ఉత్పత్తులు లేదా ఆల్కహాల్ వినియోగిస్తుంటే.
మీకు మదుమేహం ఉంటే, మీ రక్తంలో అధిక చక్కెర(గ్లూకోజ్) పొగుపడుతుంది.
అధికంగా ఉన్న చక్కెర(గ్లూకోజ్)ను గ్రహించడానికి వడపోయడానికి మీ కిడ్నీలు అధిక శక్తితో ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది, దానివల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
తరుచూ మూత్ర విసర్జన చేయడం వల్ల అధిక మొత్తంలో చక్కెర పోతుంది, దానివల్ల కెలోరీలు నష్టపడిపోతాయి.
అదే సమయంలో, మదుమేహం, మీ శరీర కణాలను రిచార్జ్ చేసేందుకు మీరు తిన్న ఆహారం నుంచి చక్కెరను గ్రహించి నిల్వ చేస్తుంది – దానివల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది.
ఈ రెండింటి వల్ల వేగంగా బరువు కొల్పోతారు
అధికంగా దాహం( దీనినే పాలిడిస్పియా అంటారు) చాలా స్పష్టంగా తెలియజేసే మదుమేహ లక్షణం.
ఒకవేళ మీకు మదుమేహం ఉంటే, అదనపు చక్కెర (గ్లూకోజ్) రక్తంలో పోగుబడుతుంది.
అధికంగా ఉన్న చక్కెర(గ్లూకోజ్)ను గ్రహించడానికి వడపోయడానికి మీ కిడ్నీలు అధిక శక్తితో ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది.
ఒకవేళ మీ కిడ్నీలు పూర్తిగా నియంత్రించకపోతే, అదనపు చక్కెర మూత్రం ద్వారా, మీ కణజాలం స్రవించే ద్రవాల ద్వారా పోతుంది.
దీనివల్ల తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, దీనివల్ల మీరు నిర్జిలీకరణకు గురవుతారు.
దాహం తీర్చుకోవడానికి అధికంగా నీరుతాగడం వల్ల, అధికంగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
మీరు బగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం వల్ల మీ శరీరం నిర్జలీకరణమైపోవడం, శక్తికి అవసరమన చక్కెరను తక్కువగా వినియోగించుకోవడం వల్ల మీ శరీరం సరిగ్గా పనిచేయకలేకపోతుంది.
అధిక మొత్తంలో చక్కెర, రక్తంలో దీర్ఘకాలంపాటు ఉంటే, రక్తసరఫరా తగ్గిపోవడం వల్ల నరాలు దెబ్బతింటాయి, దీనవల్ల చర్మం రిపేర్ చేయాల్సిన పుండ్లు, గాయాలైన ప్రాంతాలకు రక్తం చేరడం బాగా కష్టమైపోతుంది
దీనివల్ల అవి మూసుకోవడం కష్టమై, కొనని నెలల పాటు అలాగే ఉండిపోతాయి, దీంతో పెరిగే ముప్పు
కొన్నిసార్లు మదుమేహ లక్షణాలు కంటిచూపు రూపంలో కూడా కనిపిస్తాయి.
రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే, అది కణజాలంలోని ద్రవాలను పీల్చేస్తుంది, మీ కంటిలోని లెన్స్ తో సహా.
ఇది మీ దృష్టి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మీ రక్తంలోని అధిక చక్కెర కారణంగా నరాలు దెబ్బతింటాయి.
మీ చేతులు, పాదాల్లో జలదరింపు, స్పర్శ కోల్పోవడం మీరు గుర్తించలేకపోవచ్చు, అలాగే మోచేతులు, చేతులు, కాళ్లు, పాదాలు మండుతున్న విషయం గుర్తించలేరు.
75 శాతం మంది మహిళలు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా యోని ఇన్ఫెక్షన్ కి గురై ఉంటారు.
రక్తంలో అధికంగా చక్కెర స్థాయి ఉండటానికి, యోని ఇన్ఫెక్షన్లకు మధ్య కీలక సంబంధమే ఉంది.
కొన్ని అంశాలు ఇన్ఫెక్షన్ రిస్క్ ను పెంచుతాయి, అందులో మదుమేహం కూడా ఒకటి.
మదుమేహం ఉన్న పురుషుల్లో 35 నుంచి 75 శాతం మంది తమ జీవిత కాలంలో కనీసం కొంత మేరకైనా అంగస్తంభన, నపుంసత్వక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
అదుపులోని మదుమేహం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి అందులో గుండె జబ్బులు, నరాలు దెబ్బతినడం, అవయవాలు కోల్పోడం, చూపు సమస్యలు ఉన్నాయి.
మదుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్ అవకాశాలు, సాధారణ వ్యక్తులతో పోల్చితే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ. ఇందులో చాతినొప్పి(ఎంజైనా)తో కూడిన పుపుస ధమని వ్యాధులు, స్ట్రోక్, ధమనులు మూసుకుపోవడం(అథరోస్కెర్లోసిస్) వంటివి ఉన్నాయి.
అధిక చక్కెర కారణంగా సన్నని రక్తనాళాల(కేశనాళాల) గోడలు దెబ్బతింటాయి, ప్రత్యేకింకి కాలిలో. దీనివల్ల జలదరింపు, తిమ్మెరు, మంట లేదా నొప్పి కలుగాతాయి, అవి సాధారణంగా కాలి బోటన వేలు లేదా వేలు కొనల నుంచి మొదలవుతాయి అక్కడ నుంచి క్రమక్రమంగా పైకి పాకుతాయి.
ఒకవేళ చికిత్స చేయకుండా అలా వదిలేస్తే, నరాలు స్పందనలు కొల్పోతాయి. అవి శరీర భాగాలను ప్రభావితం చేస్తాయి. నరాలు పాడై దాని ప్రభావం జీర్ణవ్యవస్థ మీద పడితే దానివల్ల వాంతులు అవుతాయి, వికారంగా అనిపిస్తుంది. డైయేరియా లేదా మలబద్దం వస్తాయి. దీనివల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్య కూడా ఏర్పడవచ్చు.
కిడ్నీలో లక్షలాది చిన్న రక్తనాళలు క్లస్టర్స్ గా ఉంటాయి. అవి మన రక్తంలోని చెత్తను ఏరివేస్తాయి. మదుమేహం వల్ల సున్నితమైన వడపోత వ్యవస్థ దెబతింటుంది. తీవ్రమైన డ్యామే జ్ వల్ల కిగ్నీ విఫలమవుతుంది, లేదా చికిత్స సాధ్యం కాని వ్యాధిగా మారుతుంది, దానికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం.
కిడ్నీలో లక్షలాది చిన్న రక్తనాళలు క్లస్టర్స్ గా ఉంటాయి. అవి మన రక్తంలోని చెత్తను ఏరివేస్తాయి. మదుమేహం వల్ల సున్నితమైన వడపోత వ్యవస్థ దెబతింటుంది. తీవ్రమైన డ్యామే జ్ వల్ల కిగ్నీ విఫలమవుతుంది, లేదా చికిత్స సాధ్యం కాని వ్యాధిగా మారుతుంది, దానికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం.
మదుమేహం వల్ల కంటినిలోరెటీనా దెబ్బతింటుంది దీనినే మదుమేహ రెటినోపి టారు. ఇది అంధత్వానికి దారితీస్తుంది. మదుమేహం వల్ల ఇతర తీవ్రమైన చూపు సంబంధిత సమస్యలు అంటే క్యాటరెక్ట్, గ్లుకోమా వచ్చే ముప్పు ఉంది,
పాదాల్లో నరాలు పాడైపోవడం లేదా, పాదాలకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ చికిత్స చేయకుండా వదిలిస్తే, తెగిన గాయలు, బొబ్బలు వంటివి తీవ్రమన ఇన్ఫెక్షన్లుగ మారిపాయి, అవి అంత త్వరగా మానవు. ఇటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల చివరకు ఆయా భాగాలు తొలిగించే పరిస్థితి రావచ్చు. మదుమేహం కారణంగా అవయవాలు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ.
చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది, వీటిలో బ్యాక్టిరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి.
మదుమేహ మందులు రక్తంలో చక్కెర స్థాయుల తక్కువగా ఉండేలా, ఇతర సమస్యలు తలెత్తకుండా చూస్తాయి.
రకరకాల మదుమేహ మందులు లేదా టాబ్లెట్లు ఉన్నాయి. అవి వేరు వేరు రకాలుగా పనిచేస్తాయి.
కొంతమంది ఒకటి కంటే ఎక్కువ మాత్ర వేసుకోవాల్సి రావచ్చు.
మీరు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయమం, రోజువారీ కార్యకలాపాలు సక్రమంగా చేస్తున్నప్పుడు మదుమేహ మాత్రగా బాగా పనిచేస్యి.
తప్పక చేయాల్సినవి:
చేయకూడనివి:
వ్యక్తుల స్థితిగతులను బట్టి, ఒక్కోసారి మదుమేహ సమస్యలన్ని నియంత్రించడానకి ఇతర ముందులు కూడా అవసరం రావచ్చు:
మీ శరీరంలో ఇన్సులిన్ క్రియాశీలకతను పెంచుతుంది, లివర్ మీద పనిచేస్తుంది, గ్లూకోజ్ ను శరీరం వినియోగించుకోవడానికి సాయపడుతుంది
బరువును తగ్గించుకోవడనికి సాయపడుతుంది
అయితే దీనివల్ల ఉదర సంబంధ ఇబ్బందులు, డయేరియా వచ్చే అవకశం ఉంది కానీ ఒక వారం రోజలు పాటు ఆహారంతో తీసుకుంటే అంతా సర్దుకుంటుంది
కొన్ని సందర్భాల్లో దాని ఖాళీ కవచం మీ టాయిలెట్ లో కనిపించొచ్చు.
గ్లూకోజ్ స్థాయికి అనుగుణంగా పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిని పెంచడంలో సాయపడుతుంది.
ఇది హైపోగ్లుకోమియాకు కారణం కాదు, ఇది సురక్షితమైన మందు
పాంక్రియాస్ లోని బిటా కణాలకు అధిక ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయమని చెబుతుంది
కొన్ని సార్లు ఇది లో బ్లడ్ సుగర్ లేదా హైపోగ్లెకోమియాకు దారితీస్తుంది.
వీటిని ఇన్సులిన్ లా చర్మం కింద ఇవ్వాల్సి ఉంటుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలకు అనుగుణంగా పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చూడటంలో సాయపడుంది
శరీరం బరువు పెరగకుండా చూడటంలో సాయపడుతుంది
ఇది గ్లైకోమియాకు కారణం కాదు కానీ కొన్నిసార్లు మీకు వికారంగా అనిపిస్తుంది.
ఇది శరీరం గ్లూకోజ్ ను తీసుకోవడంలో సాయపడుతుంది, ప్రత్యేకంచి కండరాలు
కొన్ని సార్లు దీనివల్ల బరువు పెరగడం లేదా వాపు రావటం ఉంటుంది
ఇవి తొందరగా పనిచేసే మందులు, పాంక్రియాస్ ఇన్సులిన్ ను స్రవించేలా చేయడంలో సాయపడతాయి
వీటిని భోజనంతో పాటు మాత్రమే తీసుకోవాలి
కొన్నిసార్లు వీటివల్ల హైపోగ్లుకోమా వచ్చే అవకాశం ఉంది, అయితే సల్ఫోలోరియన్స్ తో పోల్చితే అవకాశాలు బాగా తక్కువ
ఈ మాత్రలు మీరు ఆహారం తిన్న తర్వాత పేగుల నుంచి కార్బోహైడ్రేట్ గ్రహించడన్ని నెమ్మదింపజేస్తుంది
మీరు దీనిని ఆహారంతోపాటు సుకోవాలి, ఇది నేరుగా ఆహారం మీద పనిచేస్తుంది. మీరు భోజనం చేయకపోతే దీనిని తీసుకోకూడదు
ప్రారంభంలో దీని వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, అది క్రమంగా తగ్గిపోతుంది
ఇవి కిడ్నీ మీద పనిచేసి, గ్లూకోజ్ ను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి
బరువు తగ్గడంలో సాయపడతాయి
కొన్ని సార్లు వీటి వల్ల వ్యక్తిగత ఆవయవాల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
హైపోగ్లైసీమా అనేది అసాధారణమైన రీతిలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయి తగ్గిపోవడం వల్ల ఏర్పడే పరిస్థితి, సాధారణంగా 70 ఎంజి/డిఎల్ గా ఉంటుంది.
అది ఎందుకు వస్తుందంటే:
ఏదిఏమైనా, మీ వ్యక్తిగత బ్లడ్ గ్లూకోజ్ లక్ష్యాలు, అవి ఎప్పుడూ మీకు బాగా తక్కువగా ఉంటాయన్న విషయాలు మీ డాక్టర్ తో మాట్లాడటం చాలా ముఖ్యం.
మీ బ్లడ్ సుగర్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు మొదటగా, వేగంగా పనిచేసే కార్బొహేడ్రేట్స్ ను 15 గ్రాములు తినాలి లేదా తాగాలి అవి:
ఒకవేళ మీకు లో బ్లడ్ సుగర్ సమస్య ఉంటే, వెంటనే త్వరగా పనిచేసే తియ్యటి ఆహారాన్ని 15 గ్రాములు మేర వెంటనే తీసుకోవాలి, అవి;
నక్టర్నల్ హైపోగ్లైసీమియా లేదా రాత్రిపూట హైపో అనేది మదుమేహానికి ఇన్సులిన్ సుకునేవారిలో సాధారణంగా వస్తుంది. ఈ హైపో కారణంగా మెళకు వచ్చినప్పుడే లక్షణాలు గుర్తించగలరు.
దీని స్వభావాన్ని బట్టి, రాత్రి పూట ఈ హైపో కారణంగా మెళకువ వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని గుర్తిస్తారు.
కాబట్టి చాలా మందికి తమకు రాత్రిపూట వచ్చే హైపో ఉందన్న విషయం తెలియదు, మీకు నక్టర్నల్ హైపోగ్లైసీమియా ఉంటే దానిని గుర్తించడం చాలా అవసరం.
ఈ నక్టర్నల్ హైపోగ్లైసీమియా ఇన్సులిన్ తీసుకునేవారిలో సాధరణమే, మదుమేహానికి నోటి ద్వారా ఆహారం తీసుకునేవారిలో కూడి ఇది వచ్చే అవకాశం ఉంది.
నక్టర్నల్ హైపోగ్లైసీమీయా ఉన్నప్పుడు మీకు బాగా నీరసంగా అనిపించొచ్చు.
ఏదిఏమైనా, ఒకవేళ మీకు అలా లేకపోతే, ఈ క్రింద ఇవ్వబడిన హైపర్ గ్లైసీమియా లక్షణాలు ఒకటి , రెండు నిద్రలో కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి
పిల్లలకు నాక్టర్నల్ హైపోగ్లైసీమిమా ఉంటే తల్లిదండ్రలు అందోళన చెందాల్సిందే.
మదుమేహం ఉన్న పిల్లల, తల్లిదండ్రులు.. రాత్రి పూట పడుకున్న తర్వాత హైపోగ్లైసీమియా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమోనని గమనిస్తూ ఉండాలి.