మదుమేహం అంటే మన రక్తంలో అధిక మోతాదులో చక్కెర నిల్వలు ఉండటమే. ఇన్సులిన్ అని పిలవబడే రసాయనం లేదా హార్మోన్ ను మన శరీరం తగినంత మోతాదులో ఉత్పత్తి చేయకపోతే అధిక చక్కెర సమస్య తలెత్తుతుంది.

మీరు తినే ఆహారంలో అధిక భాగాన్ని శరీరం ఒక విధమైన చక్కెరగా మారుస్తుంది, దానిని గ్లుకోజ్ అంటారు.

ఈ చక్కెర మన శరీరంలోని అన్ని కణాలకు రక్తం ద్వారా ప్రయాణిస్తుంది. మీకు శక్తి కావాలంటే శరీర కణాలకు ఈ చక్కెర అవసరం.

రక్తంలోని చక్కెర, శరీర కణాల్లోకి వెళ్లడానికి ఇన్సులిన్ సాయపడుతుంది. ఇన్సులిన్ లేకపోతే, మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచడానికి మీ శరీర కణాలు చక్కెరను పొందలేవు.

రక్తంలోని చక్కెర ను శరీర కణాల్లోకి పంపించడం ద్వారా ఇన్సులిన్, రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో(మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు) ఉంచడానికి సాయపడుతుంది.

మీ రక్తంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గించడానికి తగినంత ఇన్సులిన్ లేకపోతే మీకు మదుమేహం ఉన్నట్టు.

రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మదుమేహానికి చికిత్స ఉంది, తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.

 

మీ శరీరం ఇన్సులిన్ ను ఏమాత్రం తయారు చేసుకోలేనప్పుడు

మీ శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేసుకోలేనప్పుడు, లేదా శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు.

రక్తంలోని చక్కెరను, శరీర కణాల్లోకి పంపించేందుకు తగినంత ఇన్సులిన్ లేనప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది.

 

టైప్ 2 మదుమేహంలో మన శరీరం కొంత ఇన్సులిన్ ను తయారు చేసుకుంటుంది, కానీ అది సరిపోదు.

లేదా మన శరీరం తయారు చేసుకునే ఇన్సులిన్ పనిచేయదు

టైప్ 2 మదుమేహం తరచూ పెద్ద వయస్సువారిలోనే ప్రారంభమవుతిం,కానీ చిన్న పిల్లలకు కూడా ఉండొచ్చు.

కుటుంబంలో ఎవరికైనా ఉంటే, స్థూలకాయలకు ఈ ముప్పు మరీ ఎక్కువగా.