New to Insulin Telugu – ఇన్సులిన్ నాకు ఎందుకు అవసరం ?

ఇది పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఒక ఆహర్మోను, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇన్సులిన్ లేకపోతే మన శరీరం గ్లూకోజ్ ని శక్తిగా ఉపయోగించుకోలేదు. మీకు మదుమేహం ఉంటే, మీ శరీరం ఇన్సులిన్ ను తయారు చేయలేదు, లేదా తయారయ్యే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు మీకు అదనంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది. మీకు అవసరమైన ఇన్సులిన్ ను శరీరంలోకి ఇంజెక్షన్ల రూపంలో ఇన్సులిన్ పెన్, సిరెంజ్ లేదా ఇన్సులిన్ పైప్ తో తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకుంటే: చక్కె స్థాయిలను నియంత్రిస్తాయి మీకు శక్తిని ఇస్తాయి ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి

New to Insulin Telugu – శరీరంలో ఇన్సులిన్ స్రావాలు

మనం ఉపవాసం ఉన్నప్పుడు విడులయ్యే ఇన్సులిన్ ను బసల్ ఇన్సులిన్ అంటారు. భోజనం తిన్న తర్వాత రక్తంలో పెరిగే చక్కెర నిల్వలకు అనుగుణంగా ఇన్సులిన్ స్రవించడం ఎక్కువ అవుతుంది. మదుమేహ రోగుల్లో ఈ ప్రక్రియ ప్రభావితం అవుతుంది, అందుకే వారు బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది.