Type 1 Telugu- మదుమేహం అంటే ఏమిటి?

మదుమేహం అంటే మన రక్తంలో అధిక మోతాదులో చక్కెర నిల్వలు ఉండటమే. ఇన్సులిన్ అని పిలవబడే రసాయనం లేదా హార్మోన్ ను మన శరీరం తగినంత మోతాదులో ఉత్పత్తి చేయకపోతే అధిక చక్కెర సమస్య తలెత్తుతుంది. మీరు తినే ఆహారంలో అధిక భాగాన్ని శరీరం ఒక విధమైన చక్కెరగా మారుస్తుంది, దానిని గ్లుకోజ్ అంటారు. ఈ చక్కెర మన శరీరంలోని అన్ని కణాలకు రక్తం ద్వారా ప్రయాణిస్తుంది. మీకు శక్తి కావాలంటే శరీర కణాలకు ఈ చక్కెర అవసరం. రక్తంలోని చక్కెర, శరీర కణాల్లోకి వెళ్లడానికి ఇన్సులిన్ సాయపడుతుంది. ఇన్సులిన్ లేకపోతే, మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచడానికి మీ శరీర కణాలు చక్కెరను పొందలేవు. రక్తంలోని చక్కెర ను శరీర కణాల్లోకి పంపించడం ద్వారా ఇన్సులిన్, రక్తంలో చక్కెర సాధారణ స్థాయిలో(మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు) ఉంచడానికి సాయపడుతుంది. మీ రక్తంలో అధిక చక్కెర స్థాయిలను తగ్గించడానికి తగినంత ఇన్సులిన్ లేకపోతే మీకు మదుమేహం ఉన్నట్టు. రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మదుమేహానికి చికిత్స ఉంది, తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి.

Type 1 Telugu- మీకు మదుమేహం ఎప్పుడు వస్తుంది?

మీ శరీరం ఇన్సులిన్ ను ఏమాత్రం తయారు చేసుకోలేనప్పుడు మీ శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేసుకోలేనప్పుడు, లేదా శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు. రక్తంలోని చక్కెరను, శరీర కణాల్లోకి పంపించేందుకు తగినంత ఇన్సులిన్ లేనప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది.

Type 1 Telugu- టైప్ 1 మదుమేహాలు

ఈ టైప్ 1 మదుమేహంలో, శరీరం ఇన్సులిన్ ను తయారు చేసుకోలేకపోతుంది. టైప్ 1 మదుమేహం ఎక్కువగా చిన్న పిల్లల్లో, యుక్త వయస్సు వారిలో కనిపిస్తుంది, పెద్దవాళ్లతో పోల్చితే వీరిలోనే ఎక్కువ. టైప్ 1 మదుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడానికి తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాలి.

Type 1 Telugu- టైప్ 1 మదుమేహం లక్షణాలు

  • విపరీతమైన దాహం
  • తరచూ మూత్రానికి వెళ్లాల్సి
  • రావటం
  • పండ్ల వాసనతో ఉండటం
  • తీవ్రమైన నీరసం
  • మూత్రంలో సుగర్ ఉండటం
  • బరువు విపరీంగా కోల్పోవడం

Type 1 Telugu- మదుమేహం వల్ల తలెత్తే ఇబ్బందులు

గ్లూకోజ్(మనం తిన్న ఆహారం నుంచి ఉత్పత్తి అయ్యేది)ను మన రక్త ప్రవాహం నుంచి శరీర కణాల్లోకి పంపించడానికి తప్పనిసరైన హార్మోను ఇస్సులిన్, ఇక్కడ దీనిని శక్తి కోసం ఉపయోగిస్తారు. తగినంత ఇన్సులిన్ లేకపోతే, గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోతుంది, దీనివల్ల తీవ్రమన ఆరోగ్య సమ్యలు తలెత్తుతాయి.

  • అవి ఈ క్రింద ఇవ్వబడినవి
  • గుండెపోటు, స్ట్రోక్
  • కిడ్నీ సమస్యలు
  • కాళ్లు తిమ్మిరెక్కి పోవడం, పుళ్లుపడి
  • మానకపోవడం
  • చూపు సమస్య
సాధ్యమైనంత వరకు రక్తంలో గ్లూకోజ్ లెవిల్స్ ను సాధారణంగా ఉంచుకుంటూ మీరు మదుమేహం వల్ల తల్లేత్తే సమస్యలను నిరోధించవచ్చు లేదా దీర్ఘకాలం పాటు రాకుండా ఆపుకోవచ్చు.