GDM Telugu – గర్భధారణ మధుమేహం అనగానేమి?

  • గర్భవతిగావున్న సమయంలో వృద్ధిచెందే మధుమేహాన్ని గర్భధారణ మధుమేహం అని పిలుస్తారు.
  • గర్భధారణ సమయంలో మీ శరీరం తన అదనపు అవసరాలని తీర్చేందుకై సరిపడినంత ఇన్సులిన్‌ను (రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో ముఖ్యమైన ఒక హార్మోన్) ఉత్పత్తి చేయలేని కారణంగా ఇది సంభవిస్తుంది.దీని ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికమవుతాయి.
  • గర్భధారణ మధుమేహం అనేది సాధారణంగా గర్భధారణకాలం మధ్యలో లేదా చివర్లో మొదలవుతుంది..

GDM Telugu – గర్భధారణ మధుమేహం ఎంత సాధారణమైనది?

  • గర్భధారణ మధుమేహం చాలా సాధారణమైనది.
  • గర్భధారణ సమయంలో ఇది 100 మంది మహిళలలో దాదాపు 18 మందిపై ప్రభావం చూపవచ్చు.

GDM Telugu – బరువు పెరగడం

  • బాగుగా నియంత్రించబడిన రక్తంలో చక్కెర స్థాయితో బాటు బరువు – మీ గర్భధారణ సమయంలో మీ బరువు మరియు మీరు పెరిగిన బరువు మీ పిండం బరువు పెరగడంపై చాలా ప్రభావం చూపుతాయి.
  • మీ బిఎమ్ఐ ఎంత హెచ్చుగా వుంటే మరియు గర్భధారణ సమయంలో మీరు ఎంత ఎక్కువగా పెరిగితే, మీ పిండం బరువు కూడా అంతే ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి, జన్మించక ముందే పిండం అధిక బరువు పెరిగే ప్రమాదం వుంది.
  • గర్భధారణకాలం మొదటి సగంలో స్వల్పంగా బరువు పెరగడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం ఒక మంచి ఆలోచన, అప్పుడు గర్భధారణకాలం రెండో సగంలో ఎక్కువ బరువు పెరడానికి అవకాశం వుంటుంది.